BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
ఆ డోనర్ వీర్యంతో జన్మించిన 14 దేశాల్లోని 197 మందికి క్యాన్సర్ ముప్పు.. ఇప్పటికే కొందరు మృతి, జన్యు మ్యుటేషన్ కారణమా?
''ప్రస్తుతం ఉన్న పరీక్షల ద్వారా వీర్యం దానం చేయాలనుకునే మగవారిలో ఒకటి నుంచి రెండు శాతం మందినే అనుమతిస్తున్నాం. మరింత కఠినంగా నిబంధనలు అమలుచేస్తే స్పెర్మ్ డోనర్లే ఉండరు’ అని మాంచెస్టర్ యూనివర్శిటీలో బయాలజీ మెడిసన్, హెల్త్ ఫాకల్టీ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్, గతంలో షెఫీల్డ్ స్పెర్మ్ బ్యాంక్ నిర్వహించిన ప్రొఫెసర్ అలన్ పేసీ చెప్పారు.
‘రొమ్ములు పట్టుకోవడం, పైజామా నాడా లాగడం అత్యాచార యత్నాన్ని నిరూపించడానికి చాలవు’ అన్న హైకోర్ట్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్ట్ ఏమంది?
ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారించిన సుప్రీంకోర్టు డిసెంబరు 8న కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక వేధింపుల కేసుల్లో దిగువ కోర్టులు చేసే అనుచిత వ్యాఖ్యలు బాధితులపైనా, వారి కుటుంబాలపైనా, సమాజంపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
'కూతురిని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ', మూడేళ్ల తర్వాత తండ్రి, మారుతల్లి అరెస్టు.. అసలేం జరిగింది?
ఉదయం తాము నిద్రలేచి చూసే సరికి తన కుమార్తె మంటల్లో కాలిపోయి చనిపోయిందంటూ ఆమె తండ్రి ముళ్లపూడి శ్రీనివాస్, ఆయన రెండో భార్య రూప పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు.
యవ్వనం 32 ఏళ్ల వరకు ఉంటుందంటున్న అధ్యయనం.. మనిషి మెదడు కీలక మార్పులకు గురయ్యే వయసులు ఇవే
సుమారు 4 వేల మంది మెదళ్లను స్కాన్ చేసి విశ్లేషించారు పరిశోధకులు. ఇందులో పిల్లల నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. ఈ విశ్లేషణలో మెదడు కణాల మధ్య ఉండే సంబంధాలలోని మార్పులను పరిశోధకులు గుర్తించారు.
డెమెన్షియా: వృద్ధులను వెంటాడుతున్న ఈ సమస్యకు టెక్నాలజీ పరిష్కారం చూపగలదా?
జపాన్‌లో ఇప్పటికే ఇలాంటి రోబోట్లు కొన్ని కేర్ హోమ్‌లలో వృద్ధులకు సంగీతం వినిపించడం, వ్యాయామాలు చేయించడం వంటి పనులు చేస్తున్నాయి. రాత్రివేళ ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించే రోబోట్లు కూడా వాడుతున్నారు.
విజన్ డాక్యుమెంట్: సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన ఈ దార్శనిక పత్రంలో ఏముంది? నిపుణులు ఏమంటున్నారు?
తెలంగాణ విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్న క్యూర్, ప్యూర్, రేర్ ఎకానమీలు అంటే ఏమిటి? అసలు ఈ విజన్ డాక్యుమెంట్లో ఏముంది? ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలేంటి? నిపుణులు ఏమంటున్నారు?
పిల్లలను సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచగలమా? ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది..
జరిమానాలకు కంపెనీలు భయపడతాయని అనుకోలేమని, ఫేస్‌బుక్‌లాంటి సంస్థలు కేవలం కొన్నిగంటల్లోనే వందల కోట్ల డాలర్లు సంపాదిస్తాయని, జరిమానాలు అలాంటి సంస్థలకు లెక్కకాకపోవచ్చని నిపుణులు అంటున్నారు.
వీడియో, పెళ్లి ఫోటోలతో సోషల్ మీడియాలో వైరలైన ఈ జంట ఎవరు?, వ్యవధి 5,30
ఆ జంటకు పెళ్లి శుభాకాంక్షల మాటేమోగానీ, ట్రోల్ చేస్తూ వారి శరీరపు రంగు గురించిన వ్యాఖ్యలే ఎక్కువగా కనిపించాయి.
‘‘జనం మా 11ఏళ్ల ప్రేమను కాకుండా, శరీరాల రంగునే చూశారు’’
‘‘ఒకవేళ తెల్లరంగు చర్మం ఉన్న అబ్బాయి తప్పుగా ప్రవర్తించినా, నేరం చేసినా, కేవలం అతని రంగును చూసి మంచివాడిగా భావిస్తామా? రంగు మాత్రమే ఒక వ్యక్తి తాలూకు మంచితనాన్ని లేదా చెడ్డతనాన్ని నిర్ణయించగలదా?’’
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
ఫీచర్లు
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
భూతకోల: ఏమిటీ ఆచారం, బయటి ప్రాంతాలలో దీనిని ప్రదర్శించకూడదా?
బయటివారికి ఇదొక వేషంలా కనిపిస్తుంది కానీ, తుళు ప్రజలకు మాత్రం ఆ రూపం దైవం. అందుకే బయట ప్రాంతాల్లో దీన్ని ప్రదర్శించడానికి వారు ఇష్టపడరు. వేషంగా వేసుకుంటే సహించరు. భక్తితో పాటు భయం ఉంచడం కూడా లక్ష్యం అంటారు.
తెలుగుప్రజలు అరుణాచలానికి ఎక్కువగా ఎందుకు వెళతారు?
18వ శతాబ్దం నాటికే అరుణాచలం దగ్గర తెలుగు శాసనాలు కనిపించాయి. ప్రస్తుత అరుణాచల గోపుర నిర్మాణం ప్రారంభించింది శ్రీకృష్ణదేవరాయలు అయితే, దాన్ని పూర్తి చేసింది తంజావూరు తెలుగు పాలకుడు సేవప్ప నాయకుడు.
'ఇంకా పెళ్లెందుకు చేసుకోలేదు, ఏదైనా సమస్యా?'-అని పెళ్లి చేసుకోనివారిని అంటే..
''సమాజంలో ఒంటరిగా నివసిస్తున్న, విడాకులైన, లేదా భాగస్వాములను కోల్పోయిన వారి లైంగిక అవసరాల గురించి ఎవరూ మాట్లాడరు.''
కోడలికి కాఫీ పెట్టే అత్త, అత్తను అమ్మలా చూసుకునే కోడలు, ఈ మార్పు ఎలా వచ్చింది?
మన సమాజంలో అత్తా కోడళ్లకు సరిగా పొసగదనే అభిప్రాయం ఉంది.ఈ అత్తాకోడళ్ల ‘బంధం’ మీదనే సంవత్సరాల పాటు నడిచే సీరియళ్లు ఉన్నాయి. అయితే సమాజంలో ఉండే పాపులర్ పరసెప్సన్కు భిన్నంగా ఫ్రెండ్లీగా జీవించే అత్తా కోడళ్లు కూడా ఉన్నారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.























































